Pages

Thursday, December 6, 2012

                         బాధ యొక్క విలువ 

పేపరు వేసే అబ్బాయి ప్రతి రోజు ఇంటింటికీ వెళ్లి దిన పత్రికలు వేసే ఉద్యోగం  

చేస్తుండేవాడు .ఒక రోజు ఒక ఇంటికి పేపర్ ఇస్తుంటే కుక్క పిల్లలు అమ్మకానికి ఉన్నాయి 

అనే బోర్డును చూసి ఒక కుక్క పిల్లను కొందామని ఆ ఇంటికి వెళ్ళాడు.మీరు కుక్క 

పిల్లలను అమ్ముతున్నారు కదా! నాకు ఒకటి కావాలి అన్నాడు.ఆ యజమాని కుక్క 

పిల్లలు ఉన్నచోటికి తీసుకు వెళ్లి చూపించాడు.కుక్క పిల్లలు యజమానిని చూడడంతోనే 

ఒక ఉదుటున లేచి తమ సంతోషాన్ని వ్యక్త పరిచాయి.ఐతే  ఒక కుక్క పిల్ల మాత్రం 

ఒక ముల అలాగే లేయలేక పడుకొని  ఉంది.

వెంటనే ఆ కుర్రవాడు ఆ ములన పడుకొని ఉన్న కుక్క పిల్ల రేటు ఎంతండి? అని అడిగాడు.

వెంటనే ఆ యజమాని నీకు ఈ కుక్క పిల్ల వాల్ల ప్రయోజనం లేదు.దీన్ని కొనుక్కొని వెళ్లి 

ఏం చేస్తావ్! అని చెప్పాడు  యజమాని.

 అయ్యా  కుక్క పిల్ల ఎంతో చెప్పండి ? నేను మొత్తం డబ్బు ఒకేసారి ఇవ్వలేను.ప్రతి వారం 

కొద్ది కొద్దిగా తీర్చేస్తాను అని చెప్పాడు ఆ అబ్బాయి.

 

ఒరేయ్ అబ్బాయ్ నీకు  ఇంకా విషయం అర్ధం కాలేదనుకుంట.ఆ కుక్క పిల్లకు కాళ్ళు 

లేవయ్యా.ఆ అవిటి దాన్ని తీసుకెళ్ళి ఏమి చేసుకుంటావు? అన్నాడు యజమాని 

వివరిస్తూ.

వెంటనే ఆ కుర్రవాడు వంగి తన ఫ్యాంటు పైకిలాగి తన కాలు చూపించాడు.యజమాని 

ఆశ్చర్యపోయాడు ! నమ్మలేకపోతున్నాడు చెక్కతో చేయబడిన కృత్రిమ కాలు పెట్టుకొని 

ఉన్నాడు ఆ కుర్రవాడు.

 అయ్యా ఈ కుక్క పిల్ల పడే వేదన బాధ నేను గ్రహించగలను.కాలు లేని నేను చెక్కతో 

చేసిన కాలుతో నడుస్తున్నాను  అన్నాడు ఆ పిల్లవాడు.

 

మన వేదనలు,బాధలు,కష్టాలు,దుఖాలు,ఒంటరితనం, అయ్యో ! నా బాధను ఎవరు అర్ధం 

చేసుకోవడం  లేదే అని ఏడ్చే సందర్బాలు, ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు ఒక దగ్గర కూర్చొని 

విలపించిన సమయాలు, బాత్రూమ్ లోకి వెళ్లి గడియ వేసుకొని ఒంటరిగా బిగ్గరగా ఏడ్చిన 

సందర్బాలు, నన్నెవరు అర్ధం చేసుకుంటారు... నా బాధ ఎంత కటినం...నేను పడిన 

శ్రమలు,బాధలు ఇంకెవరికి రావు .నా బాధ, నా కన్నీళ్ళు నా నుండి పోవా ! అని 

బాధపడుతున్న నిన్ను అర్ధం చేసుకొనే,నీ నుండి ఆ బాధను,కష్టాన్ని,దుఃఖాన్ని 

తీసివేయగలిగే ఒకాయన ఉన్నారు ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు.

 

ఆయనకు మీరు పడుతున్న వేదన ఆయనకు తెలుసు.ఆయనను ఆశ్రయిస్తే నీ హృదయం 

లో నెమ్మది కలుగుతుంది.మనవులందరు నరకమునకు వెళ్ళకూడదు అని,ఆ బాధ వేదన 

నా చేతులతో నేను సృష్టించిన మానవుడు వెళ్లకుడదని, పాపము నుండి విడుదల కలిగి 

పరిశుద్ధంగా పరలోకానికి చేరుకోవాలని యేసు క్రీస్తు వారు ప్రజలందరి కొరకు తన రక్తాన్ని 

కార్చి ప్రాణం పెట్టి మూడవ దినమున తిరిగి లేచి ప్రజలకు పాపవిమోచన కల్గించాడు.

 

నా బాధలు అన్ని ప్రభువైన యేసుకు తెలుసంటారా ? అని మీరు అడగవచ్చు.

జవాబు : అవును దేవునుకి అన్ని తెలుసు.అయన మన గురించి మన కంటే ఎక్కువగా ఎరిగిన వాడు. (మత్తయి 27:46).మీరు చేయవలసింది ఒక్కటే.ఆయనను ఆశ్రయించడం. 


No comments:

Post a Comment