Pages

Friday, November 30, 2012

           ఎటు తోచని పరిస్థితులలో  ఏం చేయాలి !

 అన్ని విషయాలలో లేదా పరిస్థితులన్ని ప్రతికులమైనప్పుడు,ద్వారాలన్ని
ముయబడినప్పుడు , తప్పించుకునే మార్గముకానరానప్పుడు ఎటు తోచని పరిస్థితిలో ఏంచేయాలో తెలియక సతమతమవుతున్నాడు.మనుష్యులకు ఏదైనా బాధ ,కష్టం కలిగితే తట్టుకోలేకపోతున్నారు .ఈరోజులలో అనేకమంది సమస్యలు వచ్చినప్పుడు సతమతమవుతున్నారు .పరిస్థితులు ప్రతికూలం అయినప్పుడు ఏంచేయాలో తెలియక తల్లడిల్లుతుంటారు. ప్రతి ఒక్కరు జీవితం సాఫీగా సాగిపోవాలి అని అనుకుంటారు గాని,జీవితం జటిలం అయిపోతుంది.
ఎటు తోచని పరిస్థితిలో ఏంచేయాలో మానవునికి అర్ధం కావడం లేదు .  *ఈనాడు మానవుడు బాధకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఈ క్రింది విధంగా అంటువున్నారు*
* ఇక నావల్ల కాదు 24 గంటలు ఆలోచించినా ఈ సమస్య ఒక కొలిక్కి రావడం లేదు *
* నేను ఈ భయంకర వ్యాధి నుంచి విడిపించబడలేను.ఏ డాక్టరు నన్ను బాగుచేయలేడు  నాబ్రతుకింతే *
* ఎంతో కష్టపడి చదివిన నాకు ఉద్యోగం రావట్లేదు,ఉద్యోగం కొరకు ప్రయత్నించని స్థలం అంటూ లేదు .ఇక నాకు ఉద్యోగం రాదు *
* నా కుటుంబం బాగుపడదు నాభర్త త్రాగుడు మానడు.ఇక నా జీవితం ఇలాగే ఉండాల్సిందే *
* ఇక నేను ఏడ్వలేను ఏడ్చి ఏడ్చి ఇక ఏడ్వడానికి నా దగ్గర కన్నీళ్ళు లేవు*
*ఇక నా వ్యాపారం బాగుపడదు,లాభాల బాటలో సాగదు.నాకర్మ ఇంతే,
*నాకున్న ఈ అప్పులు తీరవు,ఈ అప్పులు తీర్చడానికి నాదగ్గర డబ్బు లేదు.అప్పులవాళ్ళతో నానామాటలు అనిపించుకొవాల్సి వస్తుంది .ఇక నేను చనిపోవాల్సిందే.
*ఇక చదువుకోవడానికి నాదగ్గర ఆర్ధిక స్తోమత లేదు.నేను ఇక చదువలేను.
*ఇక నేను పరిక్షలు వ్రాయను వ్రాసి వ్రాసి విసుగొస్తుంది,రాసిన పాసవ్వను.
*ఇక నా వివాహం జరుగదు ,నేను ఒంటరిగా ఉండాల్సిందే .
*కోర్టుల చుట్టూ ఇక నేను తిరుగలేను.ఈ కేసునుండి బయటపడలేను.
* ఇక నాకు చావన్న రాలేదు.ఈబాధలు భరించలేను.చచ్చినా బాగుడేంది.
అని పై విధంగా నిరాశలో కృంగిపోయి అంటున్నారు .
    
    ఎటుతోచని పరిస్థితిలో ఏంచేయాలో తెలియక మానవుడు మరణమే శరణ్యం అని ,చనిపోతే ఈ బాధ నాకు తెలియదు,దీనినుండి బయటపడడానికి ఇదొక్కటే మార్గమని ఆత్మహత్య చేసుకుంటున్నారు .  విపరీతమైన బాధలు,నిందలు,కష్టాలు ,సమస్యలు ఎదురైనప్పుడు దరికి చేరుకోలేక ధనవంతులైన,దరిద్రులైన  ధౌర్భాగ్యమైన పరిస్థితిని ఎదుర్కోవలసిందే.నా దగ్గర ఓపిక లేదు.ఈ సమస్య తీరుటకు చేయని మ్రొక్కు లేదు,చేయని ప్రార్ధన లేదు.ఇక నావల్ల కాదు అని అంటుంటారు.
     ఒక దేశానికి రాజుగా ఉన్న వ్యక్తి ఈవిధంగా అంటున్నాడు.మా దేవా ,ఈగొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు : ఏమి చేయుటకును మాకు తోచదు .నీవే మాకు దిక్కు అని ప్రార్ధన చేసెను అని దిన 20:12 లో వ్రాయబడి ఉంది.ఇక్కడ జరిగిన సంఘటనను మనం చూచినట్లయితే యుదా దేశము మీదికి మోయబీయులును,అమ్మోనీయులును,మెయోనీయులలో కొందరు దండెత్తి రాజైన యోహోషాపాతు మీదికి వచ్చిరి.అంతలో కొందరు సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యము మన మీదికి దండెత్తి వస్తున్నదని  రాజుతో చెప్పారు.గొప్ప సైన్యము వస్తున్నదని విన్న రాజు దేవుని యొద్ద విచారించుటకు (ప్రార్ధించుటకు)మనసు నిలుపుకుని, యుదా దేశమంతట ఉపవాసం ఉండి దేవుని సహాయం కొరకు వేడుకోవాలని నిర్ణయించారు .రాజైన యెహోషాపాతు పిరికితనంతో యుద్ధం చేయకుండా కూర్చోలేదు.ఇతను సామాన్యమైన రాజుకాదు ఇతనికి ఆ రోజుల్లోనే 11 లక్షల 80 వేలమంది యుద్దశూరులు ఉన్నారు.ఇంక సైనికులు ఎంతోమంది ఉన్న   యెహోషాపాతు  రాజు ప్రార్ధన చేయుటకే ఇష్టపడ్డారు. యుదాదేశపు వారి ఉపవాసం ప్రార్ధన ఉన్నతమైన దేవున్ని యుద్దరంగంలోకి దింపింది.దేవుడు వారికీ ఈవిధంగా చెప్పారు.ఈ యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించును 
అని చెప్పి దేవుడే వారి వారిపక్షమున నిలిచి వారికి విజయాన్ని ఇచ్చారు.
ప్రియా స్నేహితుల్లారా ఒక రాజు తనకున్న 11 లక్షల 80 వేలమంది యుద్ధశూరుల మీద ఆధారపడకుండా,ఎటు తోచని పరిస్థితిలో యెహోషాపాతు  రాజు దేవుని మీద ఆధారపడ్డాడు దేవుని సన్నిధిలో ఉపవాసముతో ప్రార్ధన చేసాడు.  విజయాన్ని పొందుకున్నాడు.
     ప్రియా స్నేహితుల్లారా బైబిల్ ఈవిధంగా చెబుతుంది.తన యెడల యదార్ధ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతట సంచారం చేయుచున్నది అని 2 దిన 16:9 లో వ్రాయబడి ఉంది.చిత్రమైన దేవుడు మన జీవితములో చిత్రమైన కార్యాలు చేయాలని  ఆశపడుతున్నాడు,శున్యములో నుండి సృష్టి,తన ప్రజలను విడిపించుటకు ఎర్ర సముద్రమును పాయలుగా చేసిన దేవుడు,తన ప్రజలకు ఆకలి వేస్తే ఆకాశమునుండి మన్నాను కురిపించిన దేవుడు,అరణ్యములో 5 రొట్టెలు 2 చేపలు ద్వారా వేలమందికి ఆహారమును ఏర్పాటుచేసిన దేవుడిని మనం సేవిస్తున్నము .మన సమస్యలను దేవుని చేతిలో పెడదాం.
ఉదా : మీ చేతిలో ఒక గడియారం ఉందనుకోండి .
గడియారం పాడైయింది.అప్పుడు మీరేం చేస్తారు ? కొందరైతే అది మొత్తం విప్పి చూస్తారు .మనలో చాలామంది అంతే.అంత ఊడదీసి అటు ఇటు మార్చుతారు.ఆ విధంగా అది మరింతగా పాడవుతుంది.దానిని  గడియారములు బాగుచేయువానికి మీరు ఇవ్వాలి.ఇది పాడయింది బాగుచేయడం మాకు చేతకాదు.మీరు బాగుచేసి పెట్టాలి అంటే అయన దానిని బాగుచేసి సమయము సరిచేసి ఇస్తాడు.దేవుడు మన సృష్టి కర్త మన సమస్యలేమిటో ఆయనకు బాగుగా తెలుసు అందుచేత మనలను మనమే దేవునుచేతికి అప్పగించుకోవాలి. సొంత ఆలోచన మీద ఆధారపడి దానిని చేయాలని చూస్తే మునుపటి కంటే సమస్య మరింత జటిలం అవుతుంది.
కనుక మన జీవితములో యేసయ్య ఉండగా అసాధ్యమేదిలేదు.విడిపోయిన కుటుంబాలు,ఆగిపోయిన వివాహ సంబందము,నిరుద్యోగ సమస్య,కేసులు,మానసికవ్యాధి,అనుమానం,ఆర్ధిక ఇబ్బందులు,ఒంటరితనం ,నాకు ఎవరులేరే,నేను ఇక  జీవించడం వేస్ట్ అనే అనేకమైన సమస్యలు ఉన్నప్పటికీ వాటి మీద మనసు నిలపకుండ మన సమస్యలు దేవునికి అప్పగించాలి.బైబిల్ ఈ విధంగా చెపుతున్నది మనుషులను నమ్ముకొనుటకంటే యెహోవాను ఆశ్రయించుట మేలు.రాజులను నమ్ముకొనుటకంటే యెహోవాను ఆశ్రయించుట మేలు.కీర్తన 118:8,9 వచనాలు. ఎటుతోచని పరిస్థితిలో యోహోషాపాతు రాజు దేవున్ని ఆశ్రయించాడు.అద్భుత విజయాన్ని పొందుకున్నాడు.
  ప్రియదేవుని బిడ్డల్లారా !యెహోవాను ఆశ్రయించుట మేలుయెహోవాను ఆశ్రయించుట మేలు దేవుడు మిమ్ములను ప్రేమిస్తున్నాడు.అయన మనందరి కొరకు ప్రాణం పెట్టునంతగా దేవుడు మనలను ప్రేమించాడు. ఆయన మన జీవితంలో ఏదైనా చేయగల సమర్ధుడు.ఎటుతోచని పరిస్థితులలో దేవున్ని ఆశ్రయించుదాం!...ప్రభువు మనపట్ల చేసే కార్యాలను కళ్ళారా చూద్దాం!
దేవుడు మిమ్ములను దీవించును గాక ! 
 

Thursday, November 29, 2012

                       చక్కని సూక్తులు  

1.కన్నీటి  ప్రార్ధన పరలోకమును కదిలించు ప్రార్ధన.
2.యెరికో గోడలను చూసి భయపడవద్దు యెరికో గోడల   కన్నపైన  ఉన్నవాడిని చూడు .
3.ప్రార్ధన అగ్ని గుండమును ఆరాధనగా మార్చును.
4.బంగారము లోని ప్రతి సన్నని తీగకు విలువవున్నట్లే మన జీవితములోని  ప్రతి క్షణానికి విలువ ఉంటుంది.
5.శ్రమదినమున క్రుంగిపోకు కరుణామయుడైన యేసు వైపు చూడు .
6.అనేకులు ఒంటరిగా జీవించుటకు కారణం వారు వంతెనలు కట్టుటకు బదులు అడ్డుగోడలు నిర్మించుకుంటునారు.
7.నీ ముఖముపై  మచ్చలు ముడతలు పడవచ్చు గాని నీ హృదయముపై మచ్చలు పడనీయకు.
8.కెరటాలు అనేవి నీటిపై ఉంటాయి గాని నీటిలోపల అంత మౌనమే వుంటుంది.
మంచివారి హృదయము కూడా అంతే.
9.మూర్కుని హృదయం నోటిలో వుంటుంది.బుద్దిమంతుని నోరు హృదయంలో ఉంటుంది.
10.డబ్బును దేవుడుగా పూజిస్తే అది దయ్యమై పీడిస్తుంది.

ఫై సూక్తులు క్రైస్తవుల ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడగలవని ఆశిస్తున్నాము.చదివిన మిమ్ములను దేవుడు దీవించును గాక!