Pages

Saturday, December 1, 2012

                                      నిద్రపట్టడం లేదా ?

ఈ రోజులలో నిద్ర అనేది కరువైపోయినది .ప్రపంచములో ఎక్కువ మంది నిద్రలేమి కలిగి ఉన్నారు నిద్రపట్టని వారిని అయ్యా! మీకెందుకు నిద్రపట్టడం లేదు అని అడిగితే ఈ క్రింది విధంగా చెబుతారు .

 

*నాకు చాలా సమస్యలు ఉన్నాయి అవి ఎప్పుడు నన్ను బాధిస్తాయి .రాత్రిళ్ళు ఈ ఆలోచనతో నాకు నిద్ర రావడం లేదు అని అంటారు.

 

*నేను అనేక మంది దగ్గర అప్పు చేసాను.అప్పు తీర్చమని నన్ను ఒకటే ఇబ్బంది పెడుతున్నారు .వారి డబ్బును వారికి ఇవ్వాలి.ఎలా ఆ అప్పును తీర్చగలను అనే బాధతో రాత్రంతా  నిద్రపట్టడం లేదు అని అంటారు.

 

*నేను మానసికంగా కృంగియున్నాను నాకు నిద్రపట్టడం లేదు అని డాక్టర్ దగ్గరకు వెళ్తే నీవు మానసికమైన వ్యాధితో బాధపడుతున్నావు అని, ఇదిగో ఈ నిద్రమాత్రలు ఇచ్చారు.అవి వేసుకుంటేనే నిద్రపడుతుంది లేకపోతే లేదు అని అంటుంటారు.

 

*నేను నా భార్య పిల్లలను ఎలా పోషించగలను? నా కుటుంబంలో ఏ కొరత లేకుండా నేను చుసుకోగలనా ? పలువిధములైన ఆర్ధిక ఇబ్బందులతో నేను నిద్రపోయి చాలా రోజులైయింది అని అంటుంటారు .

 

*నేను చాల డబ్బు సంపాదించాను.కాని రాత్రిపూట ఎవరు నన్ను చంపి ఆ డబ్బును తీసుకువెళ్తారోనని భయంతో  నిద్రరావడం లేదు అని అంటుంటారు.

 

*ఈ మధ్య నాకు చనిపోతనేమో అని నాకు భయం పట్టుకుంది.డాక్టర్ వద్దకు వెళ్తే నీకు ఏమి లేదు అని చెబుతున్నారు.కూర్చోలేక పోతున్నాను, పడుకోలేకపోతున్నాను నాకేమైందో నాకే అర్ధం కావడం లేదు.నన్ను చూసి అందరు నవ్వుకుంటున్నారు. నేను మనశాంతిగా నిద్రపోయి చాల రోజులైయింది అని చెబుతుంటారు.

ఇలా ఎవరిని అడిగిన నాకు నిద్రపట్టడం లేదు అని వాపోతుంటారు.ఈ రోజులలో ఈవిదంగా చాల మంది బాధపడుతున్నారు.నీవు ఇక జీవించు దినములు రాత్రులందు నీవు తీసుకోనిన విశ్రాంతి పైనే ఆధారపడి ఉంటుంది అని అంటారు.మంచి ఆరోగ్యానికి మంచి నిద్ర అవసరం ఒకవేళ రాత్రులందు నీకు నిద్ర పట్టకపోతే,ఆందోళన తలంపులు నిన్ను నిద్రకు దూరం చేస్తున్నపుడు దేవునికి ప్రార్ధించి,హృదయమును నిమ్మలపర్చమని అడిగి అయన మీద ఆనుకోవాలి.బైబిల్ ఈ విధంగా చెబుతుంది.తన ప్రియులు నిద్రించుచుండగా అయన వారికిచ్చుచున్నాడు.కీర్తన 127:2,ఆదాముకు గాఢ నిద్రను కలుగ చేసి అతనికి సాటియైన సహయం కలుగచేసాడు.మనకు సమస్యలు ఎన్ని ఉన్న బైబిల్ చెబుతున్నది ఒకటే ,నీ భారం యెహోవా మీద మోపుము అని మరియొక చోట నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును.అనే మాటలు మన హృదయం మీద వ్రాసుకొని ధైర్యంగా ఉండు అని చెబుతుంది.

 

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఇంగ్లండు దేశానికి  ఒక వృద్దురాలు తన అనుభవాన్ని ఈలాగు తెలియజేసినారు.యుద్ధం హోరాహోరిగా జరుగుతున్న దినములవి, బాంబుల శబ్దాలకు గుండెలు అదిరి పోవడమే కాకుండ, నరములు పగిలిపోతయా అన్నంతగా భయం మాకు ఉండినది అటువంటి పరిస్థితులలో ఏ క్షణం ఏ బాంబు వచ్చి మీద పడుతుందోనని భయం.నిద్ర అనునది ప్రజలకు దూరం అయ్యింది.నా వ్యక్తి గతంగా నేను దేవుని మీద ఆధారపడడంతో, అందరు నిద్రలేకుండా బిక్కుబిక్కు మంటూ ఉంటే నేను మాత్రం నా పరిస్థితిని దేవునికి వదిలేసినాను అప్పుడు పరలోక నెమ్మది నన్ను ఆవరించి నేను ఆ భీకర యుద్ద సమయంలో బాంబులు పడుతున్న నెమ్మదితో నిద్రపోయాను.దేవుడు నన్ను గమనించుచున్నాడు గనుక అదే ధైర్యంతో నా పడక గదిలోకి వెళ్లి హాయిగా నిద్ర పోయేదాన్ని.దేవుని కనుదృష్టి  నాపై ఉందని తెలుసు ......కనుక మాకెలాంటి హాని జరుగలేదు.

 

అవును దేవుని బిడ్డల్లారా,పేతురు ప్రభువు యొక్క ముఖ్య శిష్యుడు,ఆయన చెరసాలలో వేయబడినాడు (అపో 12:6) ఆ రాత్రియే పేతురు రెండు సంకెళ్ళతో బంధిపబడి ఇద్దరు సైనికుల మధ్య అంతటి శ్రమలో కూడా నిర్బయంగా  నిద్రించుచుండెను.దీనిని బట్టి ప్రభువు  ఏ స్థలములోనైనను నిద్రను అనుగ్రహించగలరని అర్ధం అగుచున్నది.ప్రభువైన యేసు కూడా ఒక సంధర్బంలో దోనే ఎక్కి శిష్యులతో ప్రయాణిస్తున్నపుడు ఆయన నిద్రిస్తున్నాడు (లూకా 8:23) గాలి వాన వచ్చి దొనేను కొట్టాయి.నీళ్ళు లోనికి వచ్చాయి.ప్రభువు విశ్రాంతిని అవి ఆటంకపరచలేదు ప్రభువు లేచి వాటిని గద్దించారు.సముద్రం  అంతా  నిమ్మలమైనది .

 

ప్రియమైన స్నేహితుల్లారా ! మీరు ఏ పరిస్థితులో ఉండి నిద్రలేకుండ బాధను అనుభవిస్తూ ఉండవచ్చు.రెండవ  ప్రపంచ యుద్దంలో ప్రజలందరు నిద్రలేమితో ఉంటే ఆ వృద్దురాలు దేవున్ని ఆశ్రయించగా నెమ్మదిగా నిద్రపోయింది.పేతురు కూడా చెరసాలలో నెమ్మదిగా నిద్రపోయాడు .

కానీ ఈరోజులలో అనేక మంది ఇలాంటి సమస్యలతో రాత్రంతా నిద్రలేకుండా ఉంటున్నారు .ఈ రోజు దేవున్ని ఆశ్రయించు,దేవుడు చక్కని విశ్రాంతిని,నెమ్మదియైన నిద్రను అనుగ్రహించగలడు.దేవుని మీద మన భారం వేసి మనకు నిద్ర లేకుండా చేస్తున్న పరిస్థితిని దేవునికి చెబుదాం! చక్కని నిద్రను పొందుకుందాం!

దేవుడు మిమ్ములను దీవించును గాక !

No comments:

Post a Comment