Pages

Saturday, December 8, 2012

 

                 The Greatness of God's LOVE






Introduction

God exhibited his love for the lost world, by offering his begotten son as a sin offering. It's the greatest love in the world. Let us see the greatness of his love in detail.
Related Bible verses: John 3:16 (main verse), Deuteronomy 33:27, Job 34:21, Psalms 139:7-8, Leviticus 11:44, Genesis 1:1-31, Genesis 2:1-25, Romans 5:8

1. He loved us while He is greater than us, (God so loved)

A. God is eternal, Deuteronomy 33:27
B. God is immutable, Hebrews 6:17
C. God knows everything, Job 34:21
D. God is omni present, Psalms 139:7-8
E. God is holy, Leviticus 11:44
F. God created everything Genesis 1:1-31, Genesis 2:1-25

2. He loved us while we were still sinners (so loved the world)

A. And while we were yet sinners Christ died for us, Romans 5:8
B. He did not die for the righteous alone.

3. His love is not selfish, (that he gave his only son)


A. We love only those who loves us in return
B. But Jesus died for everyone

4. His love is open for everyone, (that who ever believes)

A. His love does not care for the skin color.
B. His love does not care for the race.
C. His love does not care about the caste.
D. Rich or poor all are equal in his presence.

5. His love saves, (whosoever believes in him should not perish)

A. You could be a murderer. But you will not go to hell, if you believe in Jesus, repent and turn from your evil ways.

Conclusion

Are you ready to enjoy the greatest love?

Thursday, December 6, 2012

                         బాధ యొక్క విలువ 

పేపరు వేసే అబ్బాయి ప్రతి రోజు ఇంటింటికీ వెళ్లి దిన పత్రికలు వేసే ఉద్యోగం  

చేస్తుండేవాడు .ఒక రోజు ఒక ఇంటికి పేపర్ ఇస్తుంటే కుక్క పిల్లలు అమ్మకానికి ఉన్నాయి 

అనే బోర్డును చూసి ఒక కుక్క పిల్లను కొందామని ఆ ఇంటికి వెళ్ళాడు.మీరు కుక్క 

పిల్లలను అమ్ముతున్నారు కదా! నాకు ఒకటి కావాలి అన్నాడు.ఆ యజమాని కుక్క 

పిల్లలు ఉన్నచోటికి తీసుకు వెళ్లి చూపించాడు.కుక్క పిల్లలు యజమానిని చూడడంతోనే 

ఒక ఉదుటున లేచి తమ సంతోషాన్ని వ్యక్త పరిచాయి.ఐతే  ఒక కుక్క పిల్ల మాత్రం 

ఒక ముల అలాగే లేయలేక పడుకొని  ఉంది.

వెంటనే ఆ కుర్రవాడు ఆ ములన పడుకొని ఉన్న కుక్క పిల్ల రేటు ఎంతండి? అని అడిగాడు.

వెంటనే ఆ యజమాని నీకు ఈ కుక్క పిల్ల వాల్ల ప్రయోజనం లేదు.దీన్ని కొనుక్కొని వెళ్లి 

ఏం చేస్తావ్! అని చెప్పాడు  యజమాని.

 అయ్యా  కుక్క పిల్ల ఎంతో చెప్పండి ? నేను మొత్తం డబ్బు ఒకేసారి ఇవ్వలేను.ప్రతి వారం 

కొద్ది కొద్దిగా తీర్చేస్తాను అని చెప్పాడు ఆ అబ్బాయి.

 

ఒరేయ్ అబ్బాయ్ నీకు  ఇంకా విషయం అర్ధం కాలేదనుకుంట.ఆ కుక్క పిల్లకు కాళ్ళు 

లేవయ్యా.ఆ అవిటి దాన్ని తీసుకెళ్ళి ఏమి చేసుకుంటావు? అన్నాడు యజమాని 

వివరిస్తూ.

వెంటనే ఆ కుర్రవాడు వంగి తన ఫ్యాంటు పైకిలాగి తన కాలు చూపించాడు.యజమాని 

ఆశ్చర్యపోయాడు ! నమ్మలేకపోతున్నాడు చెక్కతో చేయబడిన కృత్రిమ కాలు పెట్టుకొని 

ఉన్నాడు ఆ కుర్రవాడు.

 అయ్యా ఈ కుక్క పిల్ల పడే వేదన బాధ నేను గ్రహించగలను.కాలు లేని నేను చెక్కతో 

చేసిన కాలుతో నడుస్తున్నాను  అన్నాడు ఆ పిల్లవాడు.

 

మన వేదనలు,బాధలు,కష్టాలు,దుఖాలు,ఒంటరితనం, అయ్యో ! నా బాధను ఎవరు అర్ధం 

చేసుకోవడం  లేదే అని ఏడ్చే సందర్బాలు, ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు ఒక దగ్గర కూర్చొని 

విలపించిన సమయాలు, బాత్రూమ్ లోకి వెళ్లి గడియ వేసుకొని ఒంటరిగా బిగ్గరగా ఏడ్చిన 

సందర్బాలు, నన్నెవరు అర్ధం చేసుకుంటారు... నా బాధ ఎంత కటినం...నేను పడిన 

శ్రమలు,బాధలు ఇంకెవరికి రావు .నా బాధ, నా కన్నీళ్ళు నా నుండి పోవా ! అని 

బాధపడుతున్న నిన్ను అర్ధం చేసుకొనే,నీ నుండి ఆ బాధను,కష్టాన్ని,దుఃఖాన్ని 

తీసివేయగలిగే ఒకాయన ఉన్నారు ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు.

 

ఆయనకు మీరు పడుతున్న వేదన ఆయనకు తెలుసు.ఆయనను ఆశ్రయిస్తే నీ హృదయం 

లో నెమ్మది కలుగుతుంది.మనవులందరు నరకమునకు వెళ్ళకూడదు అని,ఆ బాధ వేదన 

నా చేతులతో నేను సృష్టించిన మానవుడు వెళ్లకుడదని, పాపము నుండి విడుదల కలిగి 

పరిశుద్ధంగా పరలోకానికి చేరుకోవాలని యేసు క్రీస్తు వారు ప్రజలందరి కొరకు తన రక్తాన్ని 

కార్చి ప్రాణం పెట్టి మూడవ దినమున తిరిగి లేచి ప్రజలకు పాపవిమోచన కల్గించాడు.

 

నా బాధలు అన్ని ప్రభువైన యేసుకు తెలుసంటారా ? అని మీరు అడగవచ్చు.

జవాబు : అవును దేవునుకి అన్ని తెలుసు.అయన మన గురించి మన కంటే ఎక్కువగా ఎరిగిన వాడు. (మత్తయి 27:46).మీరు చేయవలసింది ఒక్కటే.ఆయనను ఆశ్రయించడం. 


Wednesday, December 5, 2012

                         మీకు తెలుసా ? Bible Quiz-2 

1.ఎవరి సంతానము నుండి సముద్రతీరమందు వుండిన జనములు వ్యాపించెను?

 

2.జల ప్రవాహము తర్వాత నోవహు పంపిన నల్ల పావురము ఓడలో నుండి తిరిగి వెళ్ళి ఏమి తీసుకొని వచ్చెను?

 

3.జల ప్రవాహము జరిగినపుడు ఎన్ని దినములు భూమి మీద నీళ్ళు ప్రబలెను?

 

4.నోవహు అనగా అర్ధమేమి?


5.నిబంధన అనే పదము ఆది (6-10) అధ్యాయాలలో ఎన్ని సార్లు వుంది?

 

6.జల ప్రవాహము జరిగినపుడు నోవహుకు ఎన్ని సంవత్సరములు?


7.యెహోవా యెదుట పరాక్రమము గల వేటగాడు అను లోకోక్తి ఎవరి మీద వుండెను?

 

8.నెఫీలులు అనగా ఎవరు?

 

9.యెహోవా - నా ఆత్మ నరులతో ఎల్ల్లప్పుడును వాదించదు అని ఆది (6-10) అధ్యాయాలలో ఎక్కడ వుంది?

 

10.ఏ పర్వతము మీద నోవహు దహనబలి అర్పించెను?

 

సమాధానాలు వెతికి వ్రాయండి.మీకు బైబిల్ లో వెతికిన మీకు సమాధానం తెలియలేదంటే 

అప్పుడు ఈ క్రింద సమాధానాలు చుడండి.

 

 

                                   చక్కని సూక్తులు -2

1.భూలోక సంబందమైన పెట్టుబడులు,నిత్యత్వములో నీకు లాభాలు తెచ్చి పెట్టవు.

 

2.తన కంటి అద్దాలు తుడుచుకోని వాడికి లోకమంత మురికిగానే కనిపిస్తుంది.

 

3.నీ శత్రువు కొరకు నీవు రగిల్చే నిప్పు అతని కంటే ఎక్కువగా నిన్నే కాలుస్తుంది.

 

4.ఆజ్ఞలను జారిచేయలన్నపుడు.మొదట ఆ ఆజ్ఞలను పాటించడం నేర్చుకోవాలి.

 

5.ఉద్రేకాలకు లొంగిన వాడు అందరికి మించిన బానిస.

 

6.ఆవేశం వలన కలిగిన ఫలితం మనలను తప్పు దారి పట్టిస్తుంది.

 

7.మనకు దేవుడు ఒక నోరు,రెండు చెవులు ఎందుకు ఇచ్చడంటే తక్కువ మాట్లాడి ఎక్కువ వినమని.

 

8.మేలునకు కీడు చేయుట దయ్యపు లక్షణం.కీడుకు కీడు చేయుట పశువు లక్షణం.మేలునకు మేలు చేయుట మానవుని లక్షణం.కీడునకు మేలుచేయుట దేవుని లక్షణం.

  

9.నీవు దేవుని కుమారుడవు,కుమార్తెవై యుండి,సాతాను కుమారుడను ,సాతాను కుమార్తెను వివాహం చేసుకుంటే నీ మమతో ఎన్నో కష్టాలు మానక తప్పవు.

 

10.ఆశీర్వాదం పొందడం హర్షణీయం.ఇతరులకు ఆశీర్వదకరంగా ఉండటం మరింత హర్షణీయం.

Tuesday, December 4, 2012

   మీకు తెలుసా ?  Bible Quiz 

  • 1. మొట్ట మొదట ఇటుకలు తయారు చేయబడిన దేశము ఏది?
  • 2. యెహోవా భూజనులందరి భాషను ఎక్కడ తారుమారు చేసెను?
  • 3. షేము నుండి అబ్రాము వరకు ఎన్ని తరములు? 
  • 4. అబ్రాముతో నిబంధన చేసుకున్న వారు ఎవరు?
  • 5. రాజు లోయ అని ఏ లోయకు పేరు?
  • 6. షాలేము రాజైన మెల్కీసెదెకు ఎవరు?
  • 7. అబ్రాము మొట్ట మొదట యెహోవాకు ఎక్కడ ప్రార్ధన చేసెను?
  • 8. అబ్రాముతో మొట్ట మొదట యెహోవా చేసిన నిబంధన ఆది(అధ్యా 11-15) లలో ఏక్కడ వుంది?
  • 9. అబ్రాము తన సహోదరుడైన లోతు కోసం ఎంత మందితో యుద్ధమునకు వెళ్ళెను?
  • 10. మొట్ట మొదట యెహోవా అబ్రాముకు ప్రత్యక్షమైన ప్రదేశము ఏది? అప్పుడు అబ్రాము వయస్సు ఎంత? 




  • సమాధానాలు


  • 1. షీనారు
  • 2. బాబెలు 
  • 3. 9
  • 4. ఎష్కోలు,ఆనేరు,మమ్రే
  • 5. షావే లోయ 
  • 6. సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు
  • 7. బేతెలుకు,హాయికి మధ్య తన గుడారములో
  • 8. ఆది 15:21
  • 9. 318
  • 10. హారాను,75 సం॥లు

Sunday, December 2, 2012

true poor

            How Poor Are We?
                                 Anonymous

One day, a rich dad took his son on a trip. Wanted to show him how poor someone can be. They spent time on the farm of a poor family. On the way home, dad asked, "Did you see how poor they are? What did you learn?"

Son said, "We have one dog, they have four, we have pool, they have rivers, we have lanterns at night, they have stars, we buy foods, they grow theirs, we have walls to protect us, they have friends, we have encyclopedias, they have Bible." Then they headed, "Thanks dad for showing me how poor we are."

MORAL LESSON: It's not about money that make us rich, it's about simplicity of having God in our lives.

Saturday, December 1, 2012

                                      నిద్రపట్టడం లేదా ?

ఈ రోజులలో నిద్ర అనేది కరువైపోయినది .ప్రపంచములో ఎక్కువ మంది నిద్రలేమి కలిగి ఉన్నారు నిద్రపట్టని వారిని అయ్యా! మీకెందుకు నిద్రపట్టడం లేదు అని అడిగితే ఈ క్రింది విధంగా చెబుతారు .

 

*నాకు చాలా సమస్యలు ఉన్నాయి అవి ఎప్పుడు నన్ను బాధిస్తాయి .రాత్రిళ్ళు ఈ ఆలోచనతో నాకు నిద్ర రావడం లేదు అని అంటారు.

 

*నేను అనేక మంది దగ్గర అప్పు చేసాను.అప్పు తీర్చమని నన్ను ఒకటే ఇబ్బంది పెడుతున్నారు .వారి డబ్బును వారికి ఇవ్వాలి.ఎలా ఆ అప్పును తీర్చగలను అనే బాధతో రాత్రంతా  నిద్రపట్టడం లేదు అని అంటారు.

 

*నేను మానసికంగా కృంగియున్నాను నాకు నిద్రపట్టడం లేదు అని డాక్టర్ దగ్గరకు వెళ్తే నీవు మానసికమైన వ్యాధితో బాధపడుతున్నావు అని, ఇదిగో ఈ నిద్రమాత్రలు ఇచ్చారు.అవి వేసుకుంటేనే నిద్రపడుతుంది లేకపోతే లేదు అని అంటుంటారు.

 

*నేను నా భార్య పిల్లలను ఎలా పోషించగలను? నా కుటుంబంలో ఏ కొరత లేకుండా నేను చుసుకోగలనా ? పలువిధములైన ఆర్ధిక ఇబ్బందులతో నేను నిద్రపోయి చాలా రోజులైయింది అని అంటుంటారు .

 

*నేను చాల డబ్బు సంపాదించాను.కాని రాత్రిపూట ఎవరు నన్ను చంపి ఆ డబ్బును తీసుకువెళ్తారోనని భయంతో  నిద్రరావడం లేదు అని అంటుంటారు.

 

*ఈ మధ్య నాకు చనిపోతనేమో అని నాకు భయం పట్టుకుంది.డాక్టర్ వద్దకు వెళ్తే నీకు ఏమి లేదు అని చెబుతున్నారు.కూర్చోలేక పోతున్నాను, పడుకోలేకపోతున్నాను నాకేమైందో నాకే అర్ధం కావడం లేదు.నన్ను చూసి అందరు నవ్వుకుంటున్నారు. నేను మనశాంతిగా నిద్రపోయి చాల రోజులైయింది అని చెబుతుంటారు.

ఇలా ఎవరిని అడిగిన నాకు నిద్రపట్టడం లేదు అని వాపోతుంటారు.ఈ రోజులలో ఈవిదంగా చాల మంది బాధపడుతున్నారు.నీవు ఇక జీవించు దినములు రాత్రులందు నీవు తీసుకోనిన విశ్రాంతి పైనే ఆధారపడి ఉంటుంది అని అంటారు.మంచి ఆరోగ్యానికి మంచి నిద్ర అవసరం ఒకవేళ రాత్రులందు నీకు నిద్ర పట్టకపోతే,ఆందోళన తలంపులు నిన్ను నిద్రకు దూరం చేస్తున్నపుడు దేవునికి ప్రార్ధించి,హృదయమును నిమ్మలపర్చమని అడిగి అయన మీద ఆనుకోవాలి.బైబిల్ ఈ విధంగా చెబుతుంది.తన ప్రియులు నిద్రించుచుండగా అయన వారికిచ్చుచున్నాడు.కీర్తన 127:2,ఆదాముకు గాఢ నిద్రను కలుగ చేసి అతనికి సాటియైన సహయం కలుగచేసాడు.మనకు సమస్యలు ఎన్ని ఉన్న బైబిల్ చెబుతున్నది ఒకటే ,నీ భారం యెహోవా మీద మోపుము అని మరియొక చోట నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును.అనే మాటలు మన హృదయం మీద వ్రాసుకొని ధైర్యంగా ఉండు అని చెబుతుంది.

 

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఇంగ్లండు దేశానికి  ఒక వృద్దురాలు తన అనుభవాన్ని ఈలాగు తెలియజేసినారు.యుద్ధం హోరాహోరిగా జరుగుతున్న దినములవి, బాంబుల శబ్దాలకు గుండెలు అదిరి పోవడమే కాకుండ, నరములు పగిలిపోతయా అన్నంతగా భయం మాకు ఉండినది అటువంటి పరిస్థితులలో ఏ క్షణం ఏ బాంబు వచ్చి మీద పడుతుందోనని భయం.నిద్ర అనునది ప్రజలకు దూరం అయ్యింది.నా వ్యక్తి గతంగా నేను దేవుని మీద ఆధారపడడంతో, అందరు నిద్రలేకుండా బిక్కుబిక్కు మంటూ ఉంటే నేను మాత్రం నా పరిస్థితిని దేవునికి వదిలేసినాను అప్పుడు పరలోక నెమ్మది నన్ను ఆవరించి నేను ఆ భీకర యుద్ద సమయంలో బాంబులు పడుతున్న నెమ్మదితో నిద్రపోయాను.దేవుడు నన్ను గమనించుచున్నాడు గనుక అదే ధైర్యంతో నా పడక గదిలోకి వెళ్లి హాయిగా నిద్ర పోయేదాన్ని.దేవుని కనుదృష్టి  నాపై ఉందని తెలుసు ......కనుక మాకెలాంటి హాని జరుగలేదు.

 

అవును దేవుని బిడ్డల్లారా,పేతురు ప్రభువు యొక్క ముఖ్య శిష్యుడు,ఆయన చెరసాలలో వేయబడినాడు (అపో 12:6) ఆ రాత్రియే పేతురు రెండు సంకెళ్ళతో బంధిపబడి ఇద్దరు సైనికుల మధ్య అంతటి శ్రమలో కూడా నిర్బయంగా  నిద్రించుచుండెను.దీనిని బట్టి ప్రభువు  ఏ స్థలములోనైనను నిద్రను అనుగ్రహించగలరని అర్ధం అగుచున్నది.ప్రభువైన యేసు కూడా ఒక సంధర్బంలో దోనే ఎక్కి శిష్యులతో ప్రయాణిస్తున్నపుడు ఆయన నిద్రిస్తున్నాడు (లూకా 8:23) గాలి వాన వచ్చి దొనేను కొట్టాయి.నీళ్ళు లోనికి వచ్చాయి.ప్రభువు విశ్రాంతిని అవి ఆటంకపరచలేదు ప్రభువు లేచి వాటిని గద్దించారు.సముద్రం  అంతా  నిమ్మలమైనది .

 

ప్రియమైన స్నేహితుల్లారా ! మీరు ఏ పరిస్థితులో ఉండి నిద్రలేకుండ బాధను అనుభవిస్తూ ఉండవచ్చు.రెండవ  ప్రపంచ యుద్దంలో ప్రజలందరు నిద్రలేమితో ఉంటే ఆ వృద్దురాలు దేవున్ని ఆశ్రయించగా నెమ్మదిగా నిద్రపోయింది.పేతురు కూడా చెరసాలలో నెమ్మదిగా నిద్రపోయాడు .

కానీ ఈరోజులలో అనేక మంది ఇలాంటి సమస్యలతో రాత్రంతా నిద్రలేకుండా ఉంటున్నారు .ఈ రోజు దేవున్ని ఆశ్రయించు,దేవుడు చక్కని విశ్రాంతిని,నెమ్మదియైన నిద్రను అనుగ్రహించగలడు.దేవుని మీద మన భారం వేసి మనకు నిద్ర లేకుండా చేస్తున్న పరిస్థితిని దేవునికి చెబుదాం! చక్కని నిద్రను పొందుకుందాం!

దేవుడు మిమ్ములను దీవించును గాక !

Friday, November 30, 2012

           ఎటు తోచని పరిస్థితులలో  ఏం చేయాలి !

 అన్ని విషయాలలో లేదా పరిస్థితులన్ని ప్రతికులమైనప్పుడు,ద్వారాలన్ని
ముయబడినప్పుడు , తప్పించుకునే మార్గముకానరానప్పుడు ఎటు తోచని పరిస్థితిలో ఏంచేయాలో తెలియక సతమతమవుతున్నాడు.మనుష్యులకు ఏదైనా బాధ ,కష్టం కలిగితే తట్టుకోలేకపోతున్నారు .ఈరోజులలో అనేకమంది సమస్యలు వచ్చినప్పుడు సతమతమవుతున్నారు .పరిస్థితులు ప్రతికూలం అయినప్పుడు ఏంచేయాలో తెలియక తల్లడిల్లుతుంటారు. ప్రతి ఒక్కరు జీవితం సాఫీగా సాగిపోవాలి అని అనుకుంటారు గాని,జీవితం జటిలం అయిపోతుంది.
ఎటు తోచని పరిస్థితిలో ఏంచేయాలో మానవునికి అర్ధం కావడం లేదు .  *ఈనాడు మానవుడు బాధకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఈ క్రింది విధంగా అంటువున్నారు*
* ఇక నావల్ల కాదు 24 గంటలు ఆలోచించినా ఈ సమస్య ఒక కొలిక్కి రావడం లేదు *
* నేను ఈ భయంకర వ్యాధి నుంచి విడిపించబడలేను.ఏ డాక్టరు నన్ను బాగుచేయలేడు  నాబ్రతుకింతే *
* ఎంతో కష్టపడి చదివిన నాకు ఉద్యోగం రావట్లేదు,ఉద్యోగం కొరకు ప్రయత్నించని స్థలం అంటూ లేదు .ఇక నాకు ఉద్యోగం రాదు *
* నా కుటుంబం బాగుపడదు నాభర్త త్రాగుడు మానడు.ఇక నా జీవితం ఇలాగే ఉండాల్సిందే *
* ఇక నేను ఏడ్వలేను ఏడ్చి ఏడ్చి ఇక ఏడ్వడానికి నా దగ్గర కన్నీళ్ళు లేవు*
*ఇక నా వ్యాపారం బాగుపడదు,లాభాల బాటలో సాగదు.నాకర్మ ఇంతే,
*నాకున్న ఈ అప్పులు తీరవు,ఈ అప్పులు తీర్చడానికి నాదగ్గర డబ్బు లేదు.అప్పులవాళ్ళతో నానామాటలు అనిపించుకొవాల్సి వస్తుంది .ఇక నేను చనిపోవాల్సిందే.
*ఇక చదువుకోవడానికి నాదగ్గర ఆర్ధిక స్తోమత లేదు.నేను ఇక చదువలేను.
*ఇక నేను పరిక్షలు వ్రాయను వ్రాసి వ్రాసి విసుగొస్తుంది,రాసిన పాసవ్వను.
*ఇక నా వివాహం జరుగదు ,నేను ఒంటరిగా ఉండాల్సిందే .
*కోర్టుల చుట్టూ ఇక నేను తిరుగలేను.ఈ కేసునుండి బయటపడలేను.
* ఇక నాకు చావన్న రాలేదు.ఈబాధలు భరించలేను.చచ్చినా బాగుడేంది.
అని పై విధంగా నిరాశలో కృంగిపోయి అంటున్నారు .
    
    ఎటుతోచని పరిస్థితిలో ఏంచేయాలో తెలియక మానవుడు మరణమే శరణ్యం అని ,చనిపోతే ఈ బాధ నాకు తెలియదు,దీనినుండి బయటపడడానికి ఇదొక్కటే మార్గమని ఆత్మహత్య చేసుకుంటున్నారు .  విపరీతమైన బాధలు,నిందలు,కష్టాలు ,సమస్యలు ఎదురైనప్పుడు దరికి చేరుకోలేక ధనవంతులైన,దరిద్రులైన  ధౌర్భాగ్యమైన పరిస్థితిని ఎదుర్కోవలసిందే.నా దగ్గర ఓపిక లేదు.ఈ సమస్య తీరుటకు చేయని మ్రొక్కు లేదు,చేయని ప్రార్ధన లేదు.ఇక నావల్ల కాదు అని అంటుంటారు.
     ఒక దేశానికి రాజుగా ఉన్న వ్యక్తి ఈవిధంగా అంటున్నాడు.మా దేవా ,ఈగొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు : ఏమి చేయుటకును మాకు తోచదు .నీవే మాకు దిక్కు అని ప్రార్ధన చేసెను అని దిన 20:12 లో వ్రాయబడి ఉంది.ఇక్కడ జరిగిన సంఘటనను మనం చూచినట్లయితే యుదా దేశము మీదికి మోయబీయులును,అమ్మోనీయులును,మెయోనీయులలో కొందరు దండెత్తి రాజైన యోహోషాపాతు మీదికి వచ్చిరి.అంతలో కొందరు సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యము మన మీదికి దండెత్తి వస్తున్నదని  రాజుతో చెప్పారు.గొప్ప సైన్యము వస్తున్నదని విన్న రాజు దేవుని యొద్ద విచారించుటకు (ప్రార్ధించుటకు)మనసు నిలుపుకుని, యుదా దేశమంతట ఉపవాసం ఉండి దేవుని సహాయం కొరకు వేడుకోవాలని నిర్ణయించారు .రాజైన యెహోషాపాతు పిరికితనంతో యుద్ధం చేయకుండా కూర్చోలేదు.ఇతను సామాన్యమైన రాజుకాదు ఇతనికి ఆ రోజుల్లోనే 11 లక్షల 80 వేలమంది యుద్దశూరులు ఉన్నారు.ఇంక సైనికులు ఎంతోమంది ఉన్న   యెహోషాపాతు  రాజు ప్రార్ధన చేయుటకే ఇష్టపడ్డారు. యుదాదేశపు వారి ఉపవాసం ప్రార్ధన ఉన్నతమైన దేవున్ని యుద్దరంగంలోకి దింపింది.దేవుడు వారికీ ఈవిధంగా చెప్పారు.ఈ యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించును 
అని చెప్పి దేవుడే వారి వారిపక్షమున నిలిచి వారికి విజయాన్ని ఇచ్చారు.
ప్రియా స్నేహితుల్లారా ఒక రాజు తనకున్న 11 లక్షల 80 వేలమంది యుద్ధశూరుల మీద ఆధారపడకుండా,ఎటు తోచని పరిస్థితిలో యెహోషాపాతు  రాజు దేవుని మీద ఆధారపడ్డాడు దేవుని సన్నిధిలో ఉపవాసముతో ప్రార్ధన చేసాడు.  విజయాన్ని పొందుకున్నాడు.
     ప్రియా స్నేహితుల్లారా బైబిల్ ఈవిధంగా చెబుతుంది.తన యెడల యదార్ధ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతట సంచారం చేయుచున్నది అని 2 దిన 16:9 లో వ్రాయబడి ఉంది.చిత్రమైన దేవుడు మన జీవితములో చిత్రమైన కార్యాలు చేయాలని  ఆశపడుతున్నాడు,శున్యములో నుండి సృష్టి,తన ప్రజలను విడిపించుటకు ఎర్ర సముద్రమును పాయలుగా చేసిన దేవుడు,తన ప్రజలకు ఆకలి వేస్తే ఆకాశమునుండి మన్నాను కురిపించిన దేవుడు,అరణ్యములో 5 రొట్టెలు 2 చేపలు ద్వారా వేలమందికి ఆహారమును ఏర్పాటుచేసిన దేవుడిని మనం సేవిస్తున్నము .మన సమస్యలను దేవుని చేతిలో పెడదాం.
ఉదా : మీ చేతిలో ఒక గడియారం ఉందనుకోండి .
గడియారం పాడైయింది.అప్పుడు మీరేం చేస్తారు ? కొందరైతే అది మొత్తం విప్పి చూస్తారు .మనలో చాలామంది అంతే.అంత ఊడదీసి అటు ఇటు మార్చుతారు.ఆ విధంగా అది మరింతగా పాడవుతుంది.దానిని  గడియారములు బాగుచేయువానికి మీరు ఇవ్వాలి.ఇది పాడయింది బాగుచేయడం మాకు చేతకాదు.మీరు బాగుచేసి పెట్టాలి అంటే అయన దానిని బాగుచేసి సమయము సరిచేసి ఇస్తాడు.దేవుడు మన సృష్టి కర్త మన సమస్యలేమిటో ఆయనకు బాగుగా తెలుసు అందుచేత మనలను మనమే దేవునుచేతికి అప్పగించుకోవాలి. సొంత ఆలోచన మీద ఆధారపడి దానిని చేయాలని చూస్తే మునుపటి కంటే సమస్య మరింత జటిలం అవుతుంది.
కనుక మన జీవితములో యేసయ్య ఉండగా అసాధ్యమేదిలేదు.విడిపోయిన కుటుంబాలు,ఆగిపోయిన వివాహ సంబందము,నిరుద్యోగ సమస్య,కేసులు,మానసికవ్యాధి,అనుమానం,ఆర్ధిక ఇబ్బందులు,ఒంటరితనం ,నాకు ఎవరులేరే,నేను ఇక  జీవించడం వేస్ట్ అనే అనేకమైన సమస్యలు ఉన్నప్పటికీ వాటి మీద మనసు నిలపకుండ మన సమస్యలు దేవునికి అప్పగించాలి.బైబిల్ ఈ విధంగా చెపుతున్నది మనుషులను నమ్ముకొనుటకంటే యెహోవాను ఆశ్రయించుట మేలు.రాజులను నమ్ముకొనుటకంటే యెహోవాను ఆశ్రయించుట మేలు.కీర్తన 118:8,9 వచనాలు. ఎటుతోచని పరిస్థితిలో యోహోషాపాతు రాజు దేవున్ని ఆశ్రయించాడు.అద్భుత విజయాన్ని పొందుకున్నాడు.
  ప్రియదేవుని బిడ్డల్లారా !యెహోవాను ఆశ్రయించుట మేలుయెహోవాను ఆశ్రయించుట మేలు దేవుడు మిమ్ములను ప్రేమిస్తున్నాడు.అయన మనందరి కొరకు ప్రాణం పెట్టునంతగా దేవుడు మనలను ప్రేమించాడు. ఆయన మన జీవితంలో ఏదైనా చేయగల సమర్ధుడు.ఎటుతోచని పరిస్థితులలో దేవున్ని ఆశ్రయించుదాం!...ప్రభువు మనపట్ల చేసే కార్యాలను కళ్ళారా చూద్దాం!
దేవుడు మిమ్ములను దీవించును గాక !